CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల
W.G: పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య సాయంగా CMRF ఆర్థిక భరోసాను కల్పిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇవాళ పాలకొల్లులోని తన కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 38 మందికి వైద్య సాయంగా CMRF నుంచి రూ. 15 లక్షల విలువైన చెక్కులను కూటమి నాయకులతో కలిసి ఆయన అందజేశారు. పేద వర్గాల వైద్య ఖర్చులను భరించాలనే ఉద్దేశంతోనే ఈ సహాయ నిధిని పునరుద్ధరించామన్నారు.