రైతు భరోసా బకాయిలు విడుదల చేయాలి: మాజీ ఎమ్మెల్యే
NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, రైతు భరోసా బకాయిలు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలో జరిగిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని, అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తార్పాలిన్లు, బస్తాలు సిద్ధం చేయాలన్నారు.