ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్వాలియర్-ఝాన్సీ హైవేపై మల్వా కాలేజ్ సమీపంలో వేగంగా వెళ్తున్న కారును ఇసుకతో నిండిన ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు స్నేహితలు అక్కడికక్కడే మృతి చెందారు. నిద్రమత్తు, అతి వేగం, పొగమంచే ఈ ప్రమాదానికి కారణమని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.