లక్ష్యం ఉంటేనే విజయం తథ్యం: కలెక్టర్
SRPT: లక్ష్యంతో చదివితేనే విద్యార్థులు విజయం సాధిస్తారని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం రామన్నగూడెం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పౌష్టికాహార పంపిణీని పరిశీలించారు. చిన్నారులు, గర్భిణులకు నాణ్యమైన ఆహారం అందించాలని అంగన్వాడీ సబ్బందికి కలెక్టర్ సూచించారు.