రేషన్ దందాలో తగ్గేదే లే..!
KDP: బియ్యం స్మగ్లర్లు కొందరు అధికారులు, పోలీసులతో బేరాలు కుదుర్చుకుని దందా కొనసాగిస్తున్నారని ప్రజలు నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఈ దందా కీలక ప్రధాన సూత్రధారిగా జమ్మలమడుగుకు చెందిన ఓ వ్యక్తి ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, అధికారులు చిన్నా చితక వారిపై దాడులు చేస్తున్నారే తప్ప కీలక వ్యక్తిపై చర్యలు తీసుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.