కేసీఆర్ నగర్‌లో నీటి కొరత

కేసీఆర్ నగర్‌లో నీటి కొరత

SRCL: తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో మూడు రోజులుగా నీటి సమస్య ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ట్యాంకర్లు వచ్చినా సరిపడా నీరు అందడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న కుటుంబాలు నీటిని పైకి తీసుకెళ్లడంలో కష్టాలు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.