'ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కలుషిత త్రాగునీరు'

'ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కలుషిత త్రాగునీరు'

GNTR: నగర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడంలో మున్సిపల్ కార్పొరేషన్ తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి విమర్శించారు. సోమవారం గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.