పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలపై దాదాపు గంటపాటు చర్చించారు. యుద్ధం ముగింపునకు తీసుకోవాల్సిన దౌత్య చర్యలపై పుతిన్ కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. యుద్ధం కారణంగా తమ మిత్ర దేశమైన ఇరాన్ పెద్ద మొత్తంలో నష్టపోతుండడంపై పుతిన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ పేర్కొంది.