ఈ నెల 20న ఉచిత కంటి వైద్య శిబిరం

ఈ నెల 20న ఉచిత కంటి వైద్య శిబిరం

ATP: పామిడిలో ఈ నెల 20న ఉచిత కంటి ఆపరేషన్‌ల మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ జిల్లాఛైర్మన్ డా.నల్లపాటి తిరుపతి నాయుడు తెలిపారు. పట్టణంలోని శ్రీ భావసార క్షత్రియ కళ్యాణ మండపంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సిబ్బంది కంటి పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు. ఫోన్ నంబరు, 2 ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, 3 ఫొటోలు తీసుకురావాలని తెలిపారు.