UPDATE: ఘటనా స్థలాన్ని పరిశీలించిన NZB CP
NZB: నవీపేట్ మండలం ఫకీరాబాద్ - మిట్టాపల్లి రహదారిలో ఓ మహిళను వివస్త్రగా చేసి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. డాగ్స్ స్క్వాడ్‌తో పరిశీలన చేయించారు. నవీపేట్ మండలంలో మహిళల హత్యలు వెలుగు చూస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.