మహిళా పోలీస్ ఆత్మహత్య

మహిళా పోలీస్ ఆత్మహత్య

NLR: జిల్లాలో విషద ఘటన చోటు చేసుకుంది. 25 వ డివిజన్ వార్డు సచివాలయంలో మహిళా పోలీస్‌గా విధులు చేపడుతున్న ప్రియ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండయ్య పాలెంలో నివాసం ఉంటున్నారు. ప్రియ ఉరి వేసుకుని చనిపోయారని స్థానికులు చెప్పారు. అయితే ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.