ఎమ్మిగనూరులో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

ఎమ్మిగనూరులో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

KNL: ఎమ్మిగనూరులో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన పేరుతో ఉన్న కేకును పార్టీ కార్యకర్తలు, అభిమానులు కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అభిమాన నటుడు బాలకృష్ణ రాష్ట్రంలో అనేక సినిమాలు తీసి దేశంలోనే అతి పెద్ద నటుడిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారని అభిమానులు కొనియాడారు.