2 ఉద్యోగాలు సాధించిన వాంకిడి వాసి

ASF: వాంకిడి మండలానికి చెందిన బెల్లాల రమేశ్, తార దంపతుల తనయుడు శివ ప్రసాద్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తాచాటారు. గత సంవత్సరం ఏపీజీబీలో జాబ్ చేస్తూ నిన్న వెలువడిన ఐబీపీఎస్ ఫలితాల్లో ఇండియన్ బ్యాంక్ క్లర్క్‌గా ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో ఇది సాధ్యమైందని శివప్రసాద్ తెలిపారు.