స్వామి వారి సేవలో MLA పెద్దిరెడ్డి
CTR: సదుం మండలం ఎర్రాతి వారి పల్లి భాస్కర్ రెడ్డి కాలనీలో వెలసిన కన్య మూల వినాయక స్వామి ఆలయంలో నాల్గవ వార్షికోత్సవ వేడుకలు ఇవాళ వైభవంగా జరిగాయి. ఆలయంలో రుద్రాభిషేకం, కలశ స్థాపన, గణపతి హోమం, రుద్రహోమం కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో ఆయనను సన్మానించారు.