అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
కరీంనగర్ నగరంలోని తీగలగుట్టపల్లి చెరువు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అమృత్ 2.0 పథకం కింద మంజూరైన నిధులతో ఈ పనులను చేపట్టారు. మేయర్ శ్రీనివాస్‌తో కలిసి ఆయన భూమిపూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా చెరువును తీర్చిదిద్దుతామని, త్వరలోనే మురుగునీటి శుద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు.