వీర జవాన్ మురళి నాయక్ బయోపిక్

'ఆపరేషన్ సిందూర్'లో వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ బయోపిక్ తెరకెక్కుతోంది. గౌతమ్ కృష్ణ హీరోగా విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు.ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నట్లు గౌతమ్ తెలిపారు. ఇది దేశం గర్వపడే సినిమా అవుతుందని పేర్కొన్నారు. తమకు అవకాశం ఇస్తే ఈ మూవీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామన్నారు.