ఖర్గేకు కిరణ్ రిజిజు కౌంటర్

ఖర్గేకు కిరణ్ రిజిజు కౌంటర్

రాజ్యసభలో మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు గట్టి కౌంటర్ ఇచ్చారు. మాజీ ఛైర్మన్‌ను గతంలో మీరు ఎంతలా అవమానించారో మర్చిపోయారా? అని నిలదీశారు. ఆయనపై పెట్టిన తొలగింపు తీర్మానంలో మీరు వాడిన భాష.. ఛైర్మన్‌ పదవి గౌరవాన్ని తగ్గించేలా ఉందని గుర్తుచేశారు. కొత్త ఛైర్మన్‌ను ఆహ్వానించే ఈ మంచి సమయంలో.. అనవసర విషయాలు మాట్లాడి రచ్చ చేయొద్దని హితవు పలికారు.