తీన్మార్ మల్లన్న సమక్షంలో చేరికలు
RR: ఇబ్రహీంపట్నంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. పట్టణానికి చెందిన ముత్యాల మనీష్, పల్లాటి రవి, అభినవ్, రమావత్ ప్రేమ్ చరణ్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై చేరారు. పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి కండువా కప్పి ఆహ్వానించారు. బీసీల హక్కుల సాధనే లక్ష్యమని, యువత శక్తితో పార్టీని బలోపేతం చేయాలని మల్లన్న పిలుపునిచ్చారు.