హత్యాచారం కేసు.. నిందితుడికి జీవిత ఖైదు
TG: 2010లో ఓ బాలికపై అత్యాచారం చేసి, నిప్పంటించి చంపిన కేసులో ప్రధాన నిందితుడు అనిల్ కుమార్‌కు నేరేడ్‌మెట్ కోర్టు జీవితఖైదు విధించింది. 13 ఏళ్లుగా పరారీలో ఉన్న ఇతడిని 2025 NOVలో పోలీసులు విజయవాడలో పట్టుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రధాన ముద్దాయికి శిక్ష పడటంతో బాధితురాలి కుటుంబానికి న్యాయం చేకూరింది.