క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

VSP: ఆనందపురం మండలం గొట్టిపల్లి పంచాయితీలో శ్రీసీతారామ తీర్థ మహోత్సవం సందర్భంగా నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను సర్పంచ్ గంటా జగదీష్ ఆదివారం ప్రారంభించారు. విన్నర్స్‌కు రూ.15 వేల నగదు బహుమతి, రన్నర్స్‌కు రూ.10 వేల నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, క్రీడాకారులు పాల్గొన్నారు.