VIDEO: సినీ నటుడు ప్రకాష్ రాజ్ దిష్టిబొమ్మ దగ్ధం
BDK: చర్ల మండల కేంద్రంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల శ్రీరామచంద్రుడి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ హిందూ ధర్మ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.