రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
WNP: వర్ష సూచన ఉన్న నేపథ్యంలో జిల్లాలో రైతులు పంట కోతలు చేపట్టకుండా వాయిదా వేసుకునేలా సూచించాలని వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అలాగే ఇప్పటికే పంట కోత చేపట్టిన రైతులు తమ ధాన్యాన్ని తడవకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆరబోసుకునే విధంగా తగు సూచనలు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.