మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NLR: బుచ్చి పట్టణ పరిధిలోని మహిళలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం రాత్రి కుట్టుమిషన్లను అందజేశారు. మెప్మా ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్లోని టైలరింగ్లో శిక్షణ తీసుకొని సర్టిఫికెట్లు పొందిన ఏడు మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందేందుకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఆమె తెలిపారు.