VIDEO: జూరాల- పాకాల ప్రాజెక్టు ప్రతిపాదనపై బీజేపీ అభ్యంతరం

GDWL: జూరాల నుంచి పాకాలకు నీటి తరలింపు వల్ల నడిగడ్డ ప్రాంతం ఎడారిగా మారే అవకాశం ఉందని బీజేపీ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి తెలిపారు. అయిజలో నేడు మీడియాతో మాట్లాడుతూ.. 2013లో అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదన తెచ్చినప్పుడు తమ పార్టీ దీన్ని వ్యతిరేకించిందని పేర్కొన్నారు. జూరాల నీటితో ఆర్డీఎస్ చివరి ప్రాంతాలకు సాగునీరు అందించాలన్నారు.