జీకేవీధి మండలంలో ముమ్మరంగా వాహన తనిఖీలు
ASR: మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్ కు నిరసనగా ఆదివారం మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గూడెం కొత్తవీధి మండలంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో మండలంలో భారీ ఎత్తున వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుండి మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రతి వాహనం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.