ఏలూరులో చోరీ.. బంగారం, నగదు మాయం
ఏలూరు రూరల్ ద్వారకానగర్లో నివాసం ఉంటున్న సాంటి వెంకట సుబ్రహ్మణ్యం ఇంటిలో శనివారం దొంగలు బీరువా తాళాలు పగలగొట్టి చోరికి పాల్పడ్డారు. వివాహ వేడుకకు కుటుంబంతో కలిసి విజయవాడ వెళ్లి తిరిగి వచ్చేసరికి ఈ ఘటన జరిగింది. 3.5 కాసుల బంగారం, వెండి ఆభరణాలు, రూ. 25 వేల నగదు పోయినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రూరల్ ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.