VIDEO: ఆసిఫాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
ASF: ఆసిఫాబాద్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడింది. గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. చెట్లు కూలిపోవడంతో పాటు కొంతమేర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది.