కనుమలోపల్లెలో రేపు మహా మృత్యుంజయ హోమం.!
KDP: సిద్ధవటం(M) భాకరాపేట సమీపంలో కనుమలోపల్లె శివాలయంలో కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా ద్వాదశి జ్యోతిర్లింగాలకు, అష్టోత్తర శివలింగములకు అభిషేక, అలంకరణ పూజలు, మంత్రపుష్పం, మహా మంగళహారతి వంటి పూజలు జరగనున్నాయి. ఈ మేరకు ఇక్కడ ప్రతిష్ఠించబడిన 108 శివలింగాలకు ప్రత్యేక పుష్ప విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు.