గుర్తు తెలియని వ్యక్తి మృతి
KRNL: జిల్లాలో సఫా కాలేజీ ఎదురుగా నేషనల్ హైవే-44 ఫ్లైఓవర్‌పై వాహనం ఢీకొనడంతో సుమారు 30 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు డార్క్ టీ-షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడు. అతడి కుడి చేతిపై త్రిశూలం గుర్తుతో పాటు కన్నడలో 'శివ' అని పచ్చబొట్టు ఉందని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు 9121101063 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.