పార్టీ తరఫున అండగా ఉంటాం: ఎమ్మెల్యే
SKLM: పలాస నియోజకవర్గంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన నవీన్, సాయి కుటుంబాలను ఎమ్మెల్యే శిరీష ఇవాళ పరామర్శించారు. ఈ మేరకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయాలతో ఆసుపత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబాల్ని కలిసి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి గ్రామంలో ఉన్న సమస్యను అడిగి తెలుసుకున్నారు.