విద్యుత్ NOC కోసం అభ్యర్థులకు తప్పని తిప్పలు
MNCL: కాసిపేట మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు విద్యుత్ శాఖ నో డ్యూ సర్టిఫికెట్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నామినేషన్ కోసం NOC కావాలని తెలపడంతో అభ్యర్థులు కొండాపూర్ విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. AE లీవ్‌లో ఉండడంతో అభ్యర్థులు ఆఫీస్ వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. సమయం తక్కువ ఉన్నందున త్వరగా NOC ఇవ్వాలని కోరుతున్నారు.