కాంగ్రెస్‌లో చేరిన కొత్తపేట సర్పంచ్

కాంగ్రెస్‌లో చేరిన కొత్తపేట సర్పంచ్

MNCL: జన్నారం మండలంలోని కొత్తపేట గ్రామ నూతన సర్పంచ్ పవర్ దినేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం ఆయన ఉట్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముజఫర్ ఖాన్ ఉన్నారు.