VIDEO: చెరువుగట్టు వద్ద రోడ్డు ప్రమాదం
NLG: నార్కట్‌పల్లి మండల పరిధిలో విషాదం చోటుచేసుకుంది. చెరువుగట్టుకి చెందిన మేకల వెంకట్ రెడ్డి బైక్‌పై వెళ్తుండగా మరో బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్ రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.