ఆర్థిక లావాదేవీలు.. యువకుడి దారుణ హత్య
HYD: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్ నగర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. నసీర్ (23) అనే యువకుడిని అతని స్నేహితులు దస్తగిరి, ఫాహత్, ఇలియాజ్, నదీమ్ కత్తులతో దాడి చేసి, తలపై బండరాయితో బాది హత్య చేశారు. ఆర్థిక లావాదేవీల గొడవలే ఈ ఘాతుకానికి కారణమని సమాచారం. నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి తెలిపారు.