ఉత్తమ సేవ ప్రశంస పత్రం అందుకున్న ఏడీఈ

ఉత్తమ సేవ ప్రశంస పత్రం అందుకున్న ఏడీఈ

KMM: విద్యుత్ శాఖలో ఎన్‌పీడీసీఎల్ పరిధిలో అత్యుత్తమ స్థాయిలో సేవలందించిన మధిర విద్యుత్ శాఖ సబ్ డివిజన్ ఏడీఈ ఎం. అనురాధ కు పురస్కారం లభించింది. శుక్రవారం వరంగల్‌లో ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ వంగూరి మోహన్ రావు చేతుల మీదుగా ఉత్తమ సేవ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. కాగా వినియోగదారుల శాఖపరమైన సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారం చూపే విధంగా అనురాధ కృషి చేశారు.