పలమనేరులో ఉచిత కంటి పరీక్షలు

CTR: పలమనేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం సుమారు 70 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు అధ్యక్షుడు జయశంకర్ తెలిపారు. వీరిలో ఆపరేషన్లు అవసరమైన 25 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రతి నెలా ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.