ఆత్మహత్యల నివారణ అవగాహన

SRD: గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లోని సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణ, అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో సంగీత ప్రదర్శనలు, మానసిక ఆరోగ్యం పట్ల సంఘీభావాన్ని, సామూహిక బాధ్యతను ప్రతిబింబించే ప్రదర్శనలు జరిగాయి. అలాగే 'ఆత్మహత్యపై దృక్పథాన్ని మార్చడం' అనే అంశంపై గోడ పత్రికల రూపకల్పన చేశారు.