18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఓకే : కలెక్టర్
GDL: జిల్లాలో ఈనెల 11, 14, 17 తేదీల్లో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 రకాల గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకుంటామని గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఫోటోతో కూడిన కుల ధ్రువీకరణ పత్రాలతో ఓటు వేయవచ్చని తెలిపారు.