VIDEO: ఎరువుల కోసం బారులు తీరిన రైతులు

SDPT: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావు పేట గ్రామంలో రైతులు యూరియా ఎరువు కోసం ఉదయాన్నే బారులు తీరారు. తొగుట రైతు ఉత్పత్తిదారుల సంఘం లిమిటెడ్ ఏకలవ్య ఫౌండేషన్‌లో యూరియా ఎరువు రావడంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీ ఎత్తున క్యూలైన్ కట్టి యూరియా కోసం బారులు తీరారు. రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.