తాహసీల్దార్‌పై అవినీతి ఆరోపణలు
MHBD: భూభారతి రిజిస్ట్రేషన్లను ఆసరాగా చేసుకొని ఇనుగుర్తి మండల తాహసీల్దార్ ఆపరేటర్, మధ్యవర్తుల ద్వారా లంచం వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు మండలానికి చెందిన ఓ యువకుడు ఆరోపించారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నటువంటి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లకు, సరైన పత్రాలు లేని వాటికి అధిక మొత్తంలో డబ్బులను కాజేస్తున్నారని ఓ యువకుడు మంగళవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.