ఎన్నికల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు

నెల్లూరు: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పటిష్టంగా ఎన్నికల కోడ్ ఆఫ్ కాండాక్ట్ అమలు చేస్తున్నట్లు ఉదయగిరి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి రాజా రమేష్ ప్రేమ్ కుమార్, సహాయక రిటర్నింగ్ అధికారి కే నెహ్రూ బాబులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాన్ షాప్స్, ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ మద్యం దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.