జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

జిల్లా ప్రజలకు  సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

JGL: జగిత్యాల జిల్లా ప్రజలందరికి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి అతిపెద్ద పండుగైన సంక్రాంతి ప్రతి ఇంటిలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించే, రైతన్నను గౌరవించే పండుగగా సంక్రాంతి ప్రత్యేకతను వివరించారు.