ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ముజ్తాబా
ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నికైన ముజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ముజ్తాబా లక్ష్యంగా క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా.. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఇరాన్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.