బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి: సీపీ
WGL: పోలీస్ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. సివిల్ ఎస్సైలుగా పదోన్నతి పొందిన వేణుగోపాల్ రెడ్డి, రాజేందర్, పర్వీన్‌లు సోమవారం సీపీని కలిసి మర్యాదపూర్వకంగా మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ బాధితులకు న్యాయం చేయాలని సీపీ తెలిపారు.