కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం సవాల్

కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం సవాల్

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. 'జూబ్లీహిల్స్‌లో బీజేపీకి 10 వేల ఓట్ల కంటే ఎక్కువ రావు. తక్కువ ఓట్లు వస్తే ఏం చేస్తారో కిషన్ రెడ్డి చెప్పాలి. BRSతో బీజేపీ కుమ్మక్కైంది. కేటీఆర్ తానా అంటే.. కిషన్ రెడ్డి తందాన అంటారు. వాళ్ల కార్యకర్తలకైనా కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం' అని అన్నారు.