మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
NGKL:పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం సింగిల్ విండో ఛైర్మన్ బుడుగు శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్నకు క్వింటాల్కు రూ. 2400 మద్దతు ధరగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు 14 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే సెంటర్‌కు తీసుకురావాలని సూచించారు.