ప్రజలకు చట్టాలపై అవగాహన అవసరం

ప్రజలకు చట్టాలపై అవగాహన అవసరం

VZM: ప్రజలకు చట్టాలపై అవగాహన అవసరమని గజపతినగరం సీఐ జీఏవీ రమణ అన్నారు. గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా నిద్రించి ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మహిళ చట్టాలతో పాటు సైబర్ నేరాలపై అవగాహన ఉండాలన్నారు. రహదారి నిబంధనలు పాటించడంతో పాటు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు.