VIDEO: విమానాశ్రయంలో పడిగాపులుకాస్తున్న ప్రయాణికులు
RR: సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు నిలిచిపోయాయి. దీని కారణంగా విమానాలన్నీ ఎయిర్ పోర్ట్‌లకే పరిమితమయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. విమాన ప్రయాణాలు రద్దు కావడంతో, మంగళవారం రాత్రి నుంచి ప్రయాణికులు ఎయిర్ పోర్ట్‌లో పడిగాపులు కాస్తున్నారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ఇండిగో ప్రయత్నిస్తోంది.