మాజీమంత్రి అంబటిపై కేసు నమోదు

మాజీమంత్రి అంబటిపై కేసు నమోదు

GNTR: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ఇటీవల తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఒక్క రోజు దీక్ష చేపట్టిన విషయం విదితమే. అయితే, ఈ దీక్ష చేసేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.