పంజా విజయ్ కుమార్ పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

MDK: రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన అల్లర్ల విషయంలో బీజెేపీ నాయకులు పంజా విజయ్ కుమార్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న పంజా విజయ్ కుమార్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.